In the memorandum, the opposition leaders have also demanded that if any discrepancy is found anywhere during the VVPAT verification, 100% counting of paper slips of VVPATs of all polling stations of that assembly segment should be done. 21 parties of the opposition have submitted a memorandum before the EC, requesting that the verification of VVPAT slips of randomly identified polling stations should be done prior to the initiation of counting of votes & not after the completion of last round of counting. 21 parties of the opposition have submitted a memorandum before the EC, requesting that the verification of VVPAT slips of randomly identified polling stations should be done prior to the initiation of counting of votes & not after the completion of last round of counting.
#VVPAT
#OppositionPartys
#electionCommission
#chandrababu
#abhishekmanu
#gulamnabiazad
#cpm
మరి కొన్ని గంటలు! దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆరంభం కాబోతున్న నేపథ్యంలో.. 21 ప్రతిపక్షాల నాయకులు పట్టువదలని విక్రమార్కుల్లాగా మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై సందేహాలు లేవనెత్తాయి. భారతీయ జనతాపార్టీ ఈ సారి కూడా అధికారంలోకి రాబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపర్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఆరోపించాయి. తమకు న్యాయం చేయాలని మొర పెట్టుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా 21 ప్రతిపక్ష పార్టీలు మంగళవారం మధ్యాహ్నం దేశ రాజధానిలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో భేటీ అయ్యాయి. కాంగ్రెస్ తరఫున గులాం నబీ ఆజాద్, అబిషేక్ మను సింఘ్వీ, అశోక్ గెహ్లాట్, సమాజ్‌వాది పార్టీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ, డీఎంకే నాయకురాలు కణిమోళి తదితరులు హాజరయ్యారు.